ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం : ఎస్‌పి

Jan 22,2024 21:34

విజయనగరం : ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలని పోలీసు అధికారులకు ఎస్‌పి ఎం.దీపిక ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వినతులు స్వీకరించారు. బాధితుల సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియోకాన్ఫరెన్సులో మాటాడారు. ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి విచారణ చేసి వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్‌, విజయనగరం డిఎస్‌పి ఆర్‌.గోవిందరావు, డిసిర్‌బి సిఐ జె. మురళి, ఎస్‌బి సిఐ కెకె వి.విజయనాధ్‌, ఎస్‌ఐలు సిద్ధార్థ్‌, ప్రభావతి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️