బస్సులు కిటకిట

Jan 13,2024 20:10

ప్రజాశకి-విజయనగరం కోట: సంక్రాంతి పండగ నేపథ్యంలో ఎక్కడెక్కడో ఉంటూ స్వగ్రామాలకు చేరుకుంటున్న వారితో స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్సు రెండు రోజులుగా కిటకిటలాడుతోంది. ఆదివారం నుంచి సంక్రాంతి కావడంతో శనివారం వేలాది మందితో ఆర్‌టిసి కాంప్లెక్సు కిక్కిరిసిపోయింది. బస్సులు ఎక్కడానికి ప్రయాణికులు పోటీ పడ్డారు. ప్రధానంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వలస కూలీలు విశాఖ, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్‌, చెన్నైలో పనులు చేసుకుంటున్నారు. అలాగే ఉద్యోగాలు, చదువు రీత్యా పలువురు ఆయా ప్రాంతాల్లో ఉన్న వారంతా స్వగ్రామాలకు వస్తుండడంతో బస్సులన్నీ కిటకిటలాడు తున్నాయి. ప్రయాణి కులకు సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

➡️