రాష్ట్ర స్థాయిలో సత్తాచాటిన హాసిని

Jan 2,2024 21:46

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌: రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫేర్‌ పోటీల్లో రాజాం మండలం డోలపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఐ.హాసిని సత్తాచాటింది. హాసిని రూపొందించిన స్మార్ట్‌ ట్రాలీ ప్రయోగానికి రాష్ట్ర స్థాయిలో విద్యార్థి వ్యక్తిగత విభాగంలో ప్రథమ బహుమతి వచ్చింది. మాల్స్‌, సూపర్‌ మార్కెట్‌, షాపుల్లో సరుకులు రవాణా సులువుగా చేయుటకు ఇది ఉపయోగ పడుతుంది. స్వయం నియంత్రణతో పనిచేస్తూ వృద్ధులకు, వికలాంగులకు ఉపయోగపడుతుంది. ఈ నెల 27 నుంచి విజయవాడలో జరిగే దక్షిణ భారత స్థాయి సైన్స్‌ఫేర్‌లో ఈ స్మార్ట్‌ ట్రాలీ పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థి ఐ.హసినిని డిఇఒ బి.లింగేశ్వర రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో గైడ్‌ టీచర్‌ ఎం.శ్రీదేవి, జిల్లా సైన్స్‌ అధికారి ఎం.కృష్ణారావు పాల్గొన్నారు.

➡️