పేలిన గ్యాస్ సిలిండర్ – పది లక్షల నష్టం

Feb 21,2024 17:19 #Vizianagaram
Exploded gas cylinder - loss of ten lakhs
  • భోగాపురంలో ఓ ఇంట్లో సుమారు పది లక్షలు ఆస్తి నష్టం

ప్రజాశక్తి-భోగాపురం : భోగాపురంలో ప్రమాదవశాత్తు జరిగిన బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో సుమారు 10 లక్షలు నష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన శిరుగుడి అప్పలరాజు ఇంట్లో వంటపాకలో మొదట మంటలు చెల్లరేగాయి. అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లడంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో ప్రక్కనున్న నూర్చిన ధాన్యం దిబ్బ, పశువులు పాకతో పాటు భూములకు సంబంధించిన విలువైన దస్తావేజులు, చదువుకున్న సర్టిఫికెట్లు, కొంత నగదు, బంగారం ఈ ప్రమాదంలో కాలిపోయాయి. పక్కనే ఉన్న మరో ఇంటికి అంటుకోవడంతో వారికి సంబంధించిన వస్తువులన్ని కాలిపోయాయి. అప్పటికే స్థానికులు చేరుకొని మంటలు ఆరిపే ప్రయత్నం చేసినప్పటికీ బలమైన గాలులు వీస్తుండడంతో జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. రెవిన్యూ అధికారులు ఆస్తి నష్టాన్ని అంచనా వేశారు. జనసేన పార్టీ నాయకులు లోకం ప్రసాద్, పల్లంట్ల జగదీష్, పళ్ళ రాంబాబు బాధితులను పరామర్శించారు.

➡️