ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా

Mar 15,2024 13:27 #Vizianagaram

ప్రజాశక్తి – విజయనగరం కోట :  ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చేసి పూర్తిగా భ్రష్టు పట్టించారని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టా అని టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బెవర భారత్ మండిపడ్డారు . శుక్రవారం నాడు టి.ఎన్.ఎస్.ఎఫ్ నాయకులను అరెస్ట్ చేసి రూరల్ పోలీసుల్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ టిడిపి హయాంలో 169 గ్రూప్‌-1 ఉద్యోగాల భ‌ర్తీకి 2018లో నోటిఫికేషన్ టిడిపి ఇచ్చింది. అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ, గ్రూప్ 1 మెయిన్స్ ప‌రీక్ష‌ల నిర్వహణ, మూల్యాంక‌నంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిందన్నారు. గ్రూప్-1 మూల్యాంకనంలో అవ‌క‌త‌వ‌క‌ల‌ను నిర్ధారిస్తూ మెయిన్స్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ, ఈ వైకాపా ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయడం బాధాకరమని బెవర భరత్, గేదెల సతీష్ అన్నారు.

➡️