జిందాల్‌ కార్మికుల నిరసన

May 19,2024 20:56

ప్రజాశక్తి-కొత్తవలస : జిందాల్‌ పరిశ్రమ వద్ద కార్మికుల నిరసన మూడో రోజు ఆదివారం కొనసాగింది. జిందాల్‌ యాజమాన్యం అర్థాంతరంగా లేఆఫ్‌ ప్రకటించడంపై కార్మికులు మండిపడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా కంపెనీ యాజమాన్యం లేఆఫ్‌ ప్రకటించడాన్ని కార్మికులు తప్పు పడుతున్నారు. మూడో రోజు ఆదివారం జిందాల్‌ కర్మాగారం వద్ద కార్మికులు వంటా వార్పు కొనసాగించారు. నిరసన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సందర్శించారు. అండగా ఉంటామని, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసానిచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కోళ్ల అప్పల రాంప్రసాద్‌, తిక్కాన చిన్న దేవుడు, గోరపల్లి రాము, పిల్ల అప్పలరాజు, సలాది భీమయ్య, వైసిపి నాయకులు సింగంపల్లి గణేష్‌, కోనదేముడు, సిఐటియు నాయకులు గాడి అప్పారావు, నమ్మి చినబాబు, బొట్ట రాము, తదితరులు పాల్గొన్నారు.

➡️