రైతుల భూములకు రక్షణ కరువు

May 7,2024 21:55

బొబ్బిలి: ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో రైతుల భూములకు రక్షణ ఉండదని మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు ఆందోళన వ్యక్తంచేశారు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయనకు మద్దతుగా మంగళవారం దాడితల్లి కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వస్తే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తుందని చెప్పారు. ఎన్నికల్లో వైసిపికి గుణపాఠం చెప్పాలని కోరారు. ప్రచారంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిరడ అప్పలస్వామి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️