మా బడిని కాపాడండి

Jul 1,2024 13:27 #Vizianagaram

ప్రజాశక్తి-విజయనగరం కోట : మా ఊరు బడిని కాపాడాలని ఉడికిలిపేట గ్రామ ప్రజలు కోరుతున్నారు. సోమవారం నాడు స్థానిక కలెక్టరేట్ గ్రీవెన్స్ లో కలెక్టర్కు గుడికిల పేట గ్రామ గ్రామాన్ని బడిని కాపాడాలని కోరుతూ ప్రజలు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ గేటు వద్ద నిరసన చేపట్టారు. అనంతరం వారు కాళ్లకు కవర్లు కట్టుకొని మాట్లాడుతూ ఉడుకులపేట గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వర్షపు నీటి వలన మునిగిపోతుంది. ఈ స్కూలు పక్కనే ఉన్న గడ్డనీరు వలన స్కూల్లోనికి నీరు వెళ్లిపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడుతుందన్నారు. విజయనగరం నుండి కుమిలి వెళ్లే రోడ్ లో ఉడుకులపేట వద్ద మొన్న ఆర్ అండ్ బి తారు రోడ్డు సిసి పైప్ కాబట్టి మట్టితో పూడ్చుకుపోవటం వలన కొండ వాగు నుండి వస్తున్న వర్షపునీరు నేరుగా కల్వర్టు మీద నుండి గ్రామంలోనికి ప్రవహిస్తుంది. అందువలన గ్రామంలోని రోడ్లు కాలువలు ఇండ్లు ప్రాథమిక పాఠశాల పూర్తిగా భర్తతో పెరిగిపోతుంది. గ్రామస్తులు విద్యార్థులు మూగజీవులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. పిల్లల బడికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. దీనితో తల్లిదండ్రులు మరో దారి లేక వేరే స్కూళ్లకు పిల్లలను పంపవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమస్యపై పలుమార్లు రాజకీయ నాయకులకు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోలేదని వాపోతున్నారు.

➡️