భోగి మంటల్లో 1, 2, 77 జీఓలు దగ్ధం

Jan 14,2024 11:20 #Vizianagaram
tdp protest against land titling act
  • సామాన్యులు లా వీరికే చెల్లు
  • రాజసం కాదు బాటసారి బాట
  • మొన్న తల్లిదండ్రులు,నేడు కుమార్తె 

ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రజా వ్యతిరేక జీవోలనై 1, 2, 77 జీఓలను విజయనగరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ అదితి విజయలక్ష్మి గజపతిరాజు, నియోజకవర్గ నాయకులు భోగిమంటలో దగ్ధం చేశారు. ఆదివారం నాడు ఉదయం అశోక్ బంగ్లా టిడిపి కార్యాలయంలో భోగి మంటలు వేసి అందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించిన ఒకటి పబ్లిక్ మీటింగ్, రెండు అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం, 77 పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు స్కాలర్షిప్ నిలుపుదలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలను భోగిమంటలు వేసి దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు అందరూ పండగను ఆనందంగా ఆహ్లాదకరంగా జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలో ఉన్న ప్రజా స్వేచ్ఛను హరించడానికి అనేక జీవోలను తీసుకువచ్చి ప్రజలకు ఆటంకాలు ఏర్పరుస్తుందని అన్నారు. అనంతరం ఆమె టిడిపి నాయకులను, బంగ్లాలో ఉన్న ప్రజలను స్థానిక ఆర్ & బి గెస్ట్ హౌస్ జంక్షన్ వద్ద ఉన్న టిఫిన్ సెంటర్ టిఫిన్స్ తీసుకువెళ్లి అతి సామాన్య వ్యక్తిగా అందరితో కలిపి టిఫిన్ చేయడం ఆకట్టుకుంది. అదేవిధంగా మొన్న తల్లిదండ్రులు హైదరాబాదులో సామాన్య ప్రయాణికులా రైలు కోసం వీక్షించడం, నేడు అదితి ఒక సామాన్యుల వెళ్లి అందరితో కలిపి టిఫిన్ చేయడం అక్కడ అందరిని ఆశ్చర్యపరచడం జరిగింది. ఎంత రాజసం ఉన్న రాజసం మిన్న కాదు బాటసారి బాటే మిన్న అనేలా వీరి తీరు చూస్తుంటే రాజసం ఎక్కడ అన్నట్టు ఉంది. నేటి రోజులు సాధారణ సర్పంచ్ మెంబర్ వార్డ్ కౌన్సిలర్ కార్పొరేటర్ మేయర్ ఒక ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు కోట్లు ఉన్నట్లు రాజకుటుంబ గల వ్యవహరిస్తుంటే ఈ పూసపాటి రాజకుటుంబం కుటుంబం మాత్రం సామాన్య జీవితానికే ఇష్టపడడం వారికే సాధ్యమన్నారు.

➡️