ఓటు వేసేందుకు వచ్చి ఇద్దరు వృద్ధులు మృతి

May 13,2024 23:19

నెల్లిమర్ల, గుమ్మలక్ష్మీపురం : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్‌లో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఇద్దరు వృద్ధులు ఎండ ధాటికి తాళలేక సొమ్మసిల్లి అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి గ్రామంలో పాలూరి పెంటమ్మ (65) ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో నిల్చుంది. సుమారు గంటసేపు నిల్చోవడంతో ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూసింది. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది వెంటనే సపర్యలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన హిజ్రా మృతి చెందాడు. మండల కేంద్రంలోని పెద్దఖర్జ గ్రామానికి చెందిన బిడ్డిక రాజారావు (55) అనే హిజ్రా ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలైన్‌లో నిల్చొన్నాడు. వడదెబ్బకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయి కన్నుమూశాడు.

➡️