విశాఖలో 4వ రోజు ఉబర్ డ్రైవర్ల సమ్మె

Mar 21,2024 12:38 #Visakha

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్ : క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో విశాఖలో ఉబర్ డ్రైవర్లు చేపట్టిన సమ్మె గురువారం నాటికి 4వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఉబర్ వాహనాలు బంద్ పాటిస్తున్నారు. బంద్ లో భాగంగా ‘ఉబర్ వాహనాల బంద్’ అంటూ వాహనాలకు పోస్టర్లు అతికించారు. ఈ కార్యక్రమానికి ఉబర్ డ్రైవర్స్ యూనియన్ (సిఐటియు) గౌరవ అధ్యక్షుడు బి.జగన్, అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాసులు, కె. పోలినాయుడు నాయకత్వం వహిస్తున్నారు. డ్రైవర్లకు ఉబర్ గతంలో ఇచ్చిన రేట్లు తగ్గించకూడదని, చట్ట ప్రకారం అదనపు కమిషన్ తీసుకోకూడదని, ఉబర్ ఫ్లాట్ ఫామ్ పీస్ 39 తీసివేయాలని, తగ్గించిన రేట్లు పెంచాలని, వే బిల్లు చూపించాలని, నెగిటివ్ బ్యాలెన్స్ రూ.1000కు మించి ఉండాలని, బుకింగ్ యాప్ లో ఎసువి పెట్టాలని, నైట్ ఫెయిర్స్ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 50 శాతం ఇవ్వాలని, ఉబర్ ఇంటర్సిటీ రేట్లు పెంచాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను విరమించేదిలేదని యూనియన్ గౌరవ అధ్యక్షుడు బి.జగన్ స్పష్టం చేశారు.

➡️