రాష్ట్రం కోసం పోరాడే వారికి ఓటేయండి

May 7,2024 00:43

ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ : రాష్ట్ర ప్రయోజనాలు బిజెపికి తాకట్టు పెట్టిన వైసిపి, టిడిపి పార్టీలను ఓడించి. ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య కోరారు. మంగళగిరి ఎమ్మెల్యేగా సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు, గుంటూరు ఎంపీగా సిపిఐ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌కు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని పెదవడ్లపూడి శివాలయం సెంటర్లో సోమవారం ప్రచారం చేశారు. ఇందులో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో కృష్ణయ్య మాట్లాడుతూ అవినీతి సామ్రాట్‌ గా ఉన్న బిజెపికి వంత పాడుతూ టిడిపి సాగిలపడటం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. రాష్ట్రాల హక్కుల కోసం కొట్టిన టిడిపి నేడు హక్కులు అరుస్తున్న నోరు మెదపకపోవడం బాధాకరమని అన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విభజన హామీల అమలు చేయని బిజెపికి మద్దతు తెలపడం ఏంటి అని ప్రశ్నించారు. సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి కషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు అప్పారావు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్న తిరుపతయ్య, మండల కార్యదర్శి జాన్‌బాబు, కోటిలింగం, జె.సాంబశివరావు, వెంకట్రావు, నంబూద్రి, కంచర్ల రాంబాబు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.ఎర్రజెండాతోనే రవాణా రంగ కార్మికుల సమస్యల పరిష్కారం
ప్రజాశక్తి తాడేపల్లి రూరల్‌ : రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఎర్రజెండాకే ఓటు వేయాలని జొన్నా శివశంకరరావు కోరారు. కొలనుకొండ జాతీయ రహదారి వద్ద ఉన్న ఆటో డ్రైవర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులతో కలిసి ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చట్టాలను సవరణ చేసిందని అన్నారు. అందులో భాగంగానే మోటార్‌ వెహికల్స్‌ 1988 సవరణ చేస్తూ, నూతన చట్టం జీవో నెంబర్‌ 10 6 ను తీసుకువచ్చిందని అన్నారు. ఈ చట్టం వలన రవాణా రంగం డ్రైవర్లకు పెద్ద ప్రమాదం ముంచుకొచ్చిందని అన్నారు. ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే నిర్లక్ష్యంగా వాహనం నడిపారని, డ్రైవర్‌ పారిపోయాడని ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల రూపాయలు జరిమానా విధించడం వంటివి ఈ చట్టంలో ఉన్నాయని ఆయన విమర్శించారు. ఇలాంటి కార్మిక వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని ఎర్రజెండా, సిఐటియు పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు నన్నపనేని శివాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్సిపి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేస్తూ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ఏర్పాటు చేస్తామని నమ్మబలికారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 12 లక్షల మంది డ్రైవర్లు ఉంటే కేవలం రెండు లక్షల 65 వేల మంది డ్రైవర్లకు మాత్రమే పథకాన్ని వర్తింప చేశారని అన్నారు. సంక్షేమ పథకాలు డ్రైవర్లకు అమలు చేయకపోగా మతోన్మాద బిజెపితో చేతులు కలపటం దుర్మార్గమని ఆయన అన్నారు. రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించేది వామపక్ష పార్టీలు మాత్రమేనని చెప్పారు. యూనియన్‌ అధ్యక్షులు ఎస్కే మౌలాలి, వెంకటేశ్వరరావు, సిఐటియు తాడేపల్లి మండల నాయకులు డి.వెంకట్‌ రెడ్డి, కే సాంబయ్య పాల్గొన్నారు.
జొన్న శివశంకరరావు, జంగాల అజరు కుమార్‌ విజయాన్ని కాంక్షిస్తూ కుంచనపల్లిలో సిపిఎం శ్రేణులు ప్రచారం చేశౄరు. ఇంటింటికి అభ్యర్థుల గుర్తులను చూపుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికై వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. మాజీ సర్పంచ్‌ అమ్మిశెట్టి సాంబయ్య రెండు పర్యాయాలు సర్పంచ్‌గా గ్రామానికి సేవలందించిన ఆయన వృద్ధాప్యంలో కదలలేని స్థితిలోనూ ప్రచారంలో పాల్గొన్నారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.నళినికాంత్‌, నాయకులు ఎ.గోపాలరావు, బి.ముత్యాలరావు, జె.రాజ్‌కుమార్‌, డి.వెంకటరెడ్డి, కె.వెంకటేశ్వరరావు, ఎ.రంగారావు, పి.కృష్ణ, కె.సాంబశివరావు, ఎస్‌.కె గన్‌, పి.భార్గవ్‌, ఎ.నాగిరెడ్డి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : ఎన్‌టిఆర్‌ కట్ట, పుష్కరకాలనీ, ఎమ్మెల రామయ్య కాలనీ, ఉండవల్లిలో ప్రచారం నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, కె.మేరి, డివి భాస్కరరెడ్డి, వై.బర్నబస్‌, డి.యోహాన్‌, లక్ష్మణరావు, ఏడుకొండలు, సామ్యేలు, దావీదు, కోటి, టి.బక్కిరెడ్డి, దినేష్‌, శ్యామ్‌, వేముల దుర్గారావు, బాష పాల్గొన్నారు.

➡️