పెన్నా నదికి జలకళ

ప్రజాశక్తి-చెన్నూరు ఎగువ ప్రాంతాల్లో కురిసన వర్షాలకు ఓ మోస్తరు వర్షాలకు కుందూ నదికి భారీగా వర్షపు నీరు చేరడంతో పెన్నానదికి వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. పెన్నా నది ఎగువ ప్రాంతంలో ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో పెన్నా నదిలోకి వర్షం నీరు పరుగులు పెడుతోంది. వల్లూరు మండలంలోని ఆదినిమ్మయపల్లి వద్ద పెన్నా నదిపై నిర్మించిన ఆనకట్ట వద్ద నీటికల సంచరించుకుంది. ఆనకట్ట నుంచి పెన్నా నదిలోకి నీరు చేరుతోంది. అక్కడ నుంచి చెన్నూరుకు నీరు నెమ్మదిగా కొనసాగుతున్నది. పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా పెద్దపెద్ద గుంతలు ఏర్పడి అక్కడ నీరు నిలిచిపోవడంతో నీటి ప్రవాహం తక్కువగా కొనసా గుతుంది. చెన్నూరు -కొండపేట పెన్నా నది వంతెన వద్దకు నీటి ప్రవాహం కొన సాగుతోంది. పెన్నా నదికి నేటి ప్రవాహం కొనసా గుతుండడంతో చెన్నూరు, కొండపేట, కుక్క రాయపల్లి, బలిసింగాయపల్లి, కనపర్తి, ఓబులంపల్లి, రామనపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో బోర్లతో పాటు వ్యవసాయం బోర్లలో నీటి సామర్థ్యం పెరుగేందుకు ఆస్కారం ఉందని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనవరి నుంచి చుక్క నీరులేని పెన్నా నదిలో నీరు నాలుగు నెలలకు పెన్నా నదిలో నేటి ప్రవాహం కనిపించింది. పెన్నా నది పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలకు ఊరటనిచ్చింది.

➡️