ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు

May 5,2024 20:31

ప్రజాశక్తి- డెంకాడ :  ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించడం వైసిపితోనే సాధ్యమని ఎమ్మెల్యే బడ్డు కొండ అప్పల నాయుడు అన్నారు. మండలంలోని గుండాలపేట, చింతలవలస, మోదవలస గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మేలు చేసిన ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. ఎమ్మెల్యేగా తనను, ఎమ్‌పిగా బెల్లాన చంద్రశేఖర్‌ను ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బంటుపల్లి వెంకటవా సుదేవరావు, వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్మునాయుడు, ఎమ్మెల్యే తనయుడు బడ్డుకొండ మణిదీప్‌నాయుడు, నాయకులు పతివాడ కృష్ణవేణి, మోదవలస సర్పంచ్‌ కనకల రామారావు, నాగ వంశపు కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ బోని అప్పలనాయుడు, జొన్నాడ సొసైటీ చైర్మన్‌ పిన్నింటి సత్యారావు, నాయకులు బుగత రమణ, నామాల రమణ, బుగత రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. 10 కుటుంబాలు వైసిపిలో చేరికచింతలవలస గ్రామంలో 10కుటుంబాలు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు వైసిపిలో చేరాయి. గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో రోగడ శివప్రసాద్‌, శ్రీనివాస్‌, ప్రసాద్‌, గిరిజాల రామకృష్ణ, తాడితూరు అప్పారావు, పెరిమల వెంకట్రావు, ఆంజరాపు బ్రహ్మానందం ఉన్నారు. వైసిపిలో చేరికలుకొత్తవలస: లక్కవరపుకోట కొత్తవలస మండలాల నుంచి యువత వైసిపిలో చేరారు. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సమక్షంలో వారంతా వైసిపిలో చేరారు. కార్యక్రమంలో పిఎసిఎస్‌ అధ్యక్షులు గొరపల్లి శివ, తదితరులు పాల్గొన్నారు.వైసిపి ఇంటింటి ప్రచారంవైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుకు మద్దతుగా ఆ పార్టీ నాయకులు ఆదివారం ముమ్మర ప్రచారం చేశారు. జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, పిఎసిఎస్‌ అధ్యక్షులు గొరపల్లి శివ, కొత్తవలస మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి, వైసిపి మండల అధ్యక్షుడు ఒబ్బిన నాయుడు, బొంతల వెంకట్రావు, గొరపల్లి రవి తదితరులు కొత్తవలసలోని 5, 6, 7 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. వావిలపాడులో సర్పంచ్‌ ఆధ్వర్యాన..వేపాడ : మండలంలోని వావిలపాడు గ్రామంలో సర్పంచ్‌ బీల రాజేశ్వరి దంపతులు ఆధ్వర్యంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఎంపిపి డి.సత్యవంతుడు, ఉప సర్పంచ్‌ జి వెంకటరావు, ఎన్‌.రాజు నాయుడు, బి.వెంకటరావు, జి.శ్రీరామ్మూర్తి, బి.చిన్నబాబు, పిఎస్‌. శ్రీను, ఈశ్వర్‌ రావు, అర్జునరావు పాల్గొన్నారు.వైసిపి ప్రభుత్వానికి మద్దతు పలకండి: ఎమ్మెల్యే శంబంగిబొబ్బిలి: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న వైసిపి ప్రభుత్వానికి ప్రతిఒక్కరూ మద్దతు పలకాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కోరారు. ఆదివారం పట్టణంలోని 7, 9వ వార్డుల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకూ వెళ్లి వైసిపి ప్రభుత్వం చేసిన మేలును వివరించారు. ప్రస్తుత ప్రభుత్వంలో పేదరికాన్నే కొలమానంగా తీసుకుని అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికలు పేదరిక నిర్మూలన, పెత్తందారీ వ్యవస్థల మధ్య జరుగుతున్నాయని తెలిపారు. ఎవరి పాలన మేలు చేస్తుందో ప్రజలు గుర్తించాలని, అందుకు అనుగుణంగా ఓట్లు వేసి వైసిపిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

➡️