ఇరుకు వంతెనతో ఇక్కట్లు

ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
గంటలపాటు నిలిచిపోతున్న ట్రాఫిక్‌
నెరవేరని నేతల హామీలు
ప్రజాశక్తి – కాళ్ల
పాలకులు మారుతున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా దశాబ్దాలుగా ఉన్న కోపల్లె -జక్కరం వంతెనకు మాత్రం మోక్షం కలగడం లేదు. ఇరుకు వంతెనపై ప్రయాణికులు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో గెలుపొందడానికి పలు హామీలు గుప్పించడం, ఆ తర్వాత మరిచిపోవడం రాజకీయ పార్టీలకు సర్వసాధారణమైంది. 2019 ఎన్నికల్లో ప్రజలకు అత్యంత అవసరమైన పలు హామీలను వైసిపి గుప్పించింది. అధికారంలోకొచ్చి నాలుగున్నరేళ్లు పూర్తయినప్పటికీ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు.ఉండి నియోజకవర్గంలో టిడిపి ఎంఎల్‌ఎగా మంతెన రామరాజు గెలుపొందారు. వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహరాజు అధికారపార్టీ తరుపున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ ఒక్కరూ కూడా ఎన్నికల్లో ఇచ్చిన కోపల్లె-జక్కరం వంతెన ప్రధాన హామీని కూడా నెరవ్చేలేకపోయారు. మండలంలో కోపల్లె -జక్కరం వంతెన ప్రధాన వంతెన ప్రమాదాలకు నిలయాలుగా మారింది. శిథిలావస్థకు చేరడం, రక్షణ గోడలు సరిగా లేకపోవడం, ఇరుకుగా ఉండటంతో ఆందోళన కలుగుతుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలిసి పోవాల్సిందే. వంతెన నిర్మించాక రెయిలింగ్‌ దెబ్బ తిన్నా అధికారులు మరమ్మతులు చేయడం లేదు. భారీ వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. కోపల్లె వంతెనల రక్షణ గోడలు ధ్వంసమై ప్రమాదభరితంగా మారాయి.బ్రిటిష్‌ హ యాంలో నిర్మించిన ఈ వంతెనపై భారీ వాహనాల రాకపోకలతో శిథిలావస్థకు చేరింది. చిన్నవాహనం ఎదురొచ్చినా తప్పుకోలేని పరిస్థితి నెలకొంది. ఇది రాష్ట్రీయ జువ్వలపాలెం రహదారిలో నిత్యం ఎదుర్కొనే అవస్థలు. జువ్వలపాలెం రోడ్డు నుంచి గుడివాడ, విజయవాడ, అమరావతి వెళ్లాలంటే ఈ రోడ్డే ప్రధాన మార్గం. ఈ రహదారిపై ఈ వంతెన ఇరుకుగా ఉంది. ఈ వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మిస్తామని గత 26 ఏళ్లుగా నేతలు హామీలు ఇస్తూ వస్తున్నారు. ప్రభుత్వాలు మా రుతున్నా, ప్రజా ప్రతినిధులు మా రుతున్నా వంతెన నిర్మాణం మాత్రం జరగడం లేదు.నెరవేరని ఎన్నికల హామీజక్కరం-కోపల్లె వంతెన ఎన్నికల హామీని నెరవేర్చడంలో అధికార, ప్రతిపక్ష నాయకులు శ్రద్ధ చూపడం లేదు. మండలంలోని జక్కరం గ్రామానికి చెందిన పాతపాటి సర్రాజు, కలవపూడి గ్రామానికి చెందిన వేటుకూరి వెంకటశివరామరాజు, మంతెన రామరాజు ఉండి ఎంఎల్‌ఎలుగా ఎన్నికయ్యారు .2004 నుంచి 2019 సార్వత్రిక, స్థానిక సంస్థల ప్రతి ఎన్నికల్లో వంతెన నిర్మాణం చేపడతామని పాలకులు హామీలు ఇచ్చారు. నిధులు వచ్చాయి. పనులు జరుగుతాయని నా యకులు ప్రసంగాలు చేయడమే తప్ప నిర్మించేందుకు చర్యలు తీసుకోలేదు.విజయవాడ వెళ్లేందుకు దగ్గర మార్గంనిత్యం భీ మవరం నుంచి విజయవాడ ఇతర పట్టణాలకు వెళ్లాలంటే ఆర్‌అండ్‌బి రోడ్డు దగ్గర మార్గం. రైల్వే గేట్లు తక్కువగా ఉండటంతో ఈ రోడ్డు నుంచి వాహన రాకపోకలు సాగు తున్నాయి. వంతెన రైయిలింగ్‌ కూలిపోయింది. వంతెన పిల్లర్లపై మొక్కలు పెరిగిపోయాయి.ట్రాఫిక్‌ కష్టాలుజువ్వలపాలెం రాష్ట్రీయ రహదారిపై ప్రయా ణించే వాహనదారులకు, ప్రయా ణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఆక్వా రంగం గణనీయంగా విస్తరించిన కాళ్ల మండలంలో ఎక్కువగా ఆక్వా ఉత్పత్తులను నిత్యం తరలిస్తుంటారు. బొండాడ మురుగు కాలువపై వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అనేక సార్లు వంతెన నిర్మాణం చేపట్టాలని వైసిపి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ధర్నాలు చేసిన సంఘటనలు ఉన్నాయి.నిధులు మంజూరైన నిర్మాణం జరగలేదువైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ఈ వంతెన నిర్మాణానికి కోర్‌ నెట్‌వర్క్‌ నిధులు రూ.12 కోట్లు మంజూరయ్యాయి. టెండర్లు పిలిచారు ఎవరూ ముందుకు రాలేదు. ట్రాఫిక్‌ కష్టాలు లేకుండా చేసేందుకు కొత్త వంతెన నిర్మాణం పనులు చేపట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

➡️