జగన్‌ పాలనలో ప్రతి గడపకూ లబ్ధి : చీఫ్‌విప్‌ ప్రసాదరాజు

ప్రజాశక్తి – నరసాపురం

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనలో ప్రతి గడపకూ లబ్ధి చేకూరిందని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. పట్టణంలో కోట వద్ద పాలెం కొండాలమ్మ గుడి వద్ద నాలుగో సచివాలయం పరిధిలో 8, 9వ వార్డులకు సంబంధించి బుధవారం జరిగిన వై ఎపి నీడ్‌ జగన్‌ కార్యక్రమానికి ముదునూరి ప్రసాదరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గడపగడపకూ లబ్ధి చేకూరిందన్నారు. ప్రజలకు మంచి చేస్తున్నందుకే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించామని చెప్పగలుగుతున్నామన్నారు. ముందుగా 8, 9వ వార్డుల్లో నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రగతి డిస్ప్ల్లే బోర్డును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ బర్రె శ్రీ వెంకటరమణ, మున్సిపల్‌ కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు బర్రె జయరాజు పాల్గొన్నారు.ఆచంట : పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని ఎఎంసి ఛైర్మన్‌ చిల్లే లావణ్య అన్నారు. రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలిలో భాగంగా బుధవారం భీమలాపురం వైసిపి ఇన్‌ఛార్జి మొల్లేటి రామకృష్ణ అధ్యక్షతన గ్రామ సచివాలయ కార్యాలయం వద్ద ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ డిజిటల్‌ బోర్డు ప్రారంభించి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా భీమలాపురం గ్రామంలోని రూ.7.17 కోట్లతో పేదలకు సంక్షేమాన్ని అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు జక్కంశెట్టి చంటి, సచివాలయ మండల కన్వీనర్‌ తమరాడ చంద్రశేఖర్‌, ముత్యాల నాగేశ్వరరావు, నాని, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. పేద రైతులకు పట్టాలిచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ అని ఎఎంసి ఛైర్మన్‌ చిల్లే లావణ్య, సర్పంచుల ఛాంబర్‌ అధ్యక్షులు సుంకర సీతారామ్‌ స్పష్టం చేశారు. బుధవారం పెదమల్లంలో సర్పంచి దిరిశాల విజయలక్ష్మి అధ్యక్షతన రాష్ట్రానికి జగన్‌ ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. సుంకర సీతారామ్‌ మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి డైరెక్టర్‌ కొండేటి భవానీప్రసాద్‌, నక్కా శ్రీను, మోహన్‌ పాల్గొన్నారు.మొగల్తూరు : వైసిపి పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాద రాజు అన్నారు. కాళీపట్నం పడమర గ్రామ సచివాలయం వద్ద బుధవారం వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా చూడాలన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో రూ.33.48 కోట్లు ఈ ఒక్క సచివాలయం పరిధిలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఖర్చు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీటికి పనులకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ముందుగా ప్రగతి డిస్ప్లే బోర్డును ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపిలు కవురు సీతామాలక్ష్మి, కైలా సుబ్బారావు, సర్పంచి కవరు సావిత్రి ఆదినారాయణ పాల్గొన్నారు.పాలకోడేరు : రానున్న రోజుల్లో వైసిపికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు అన్నారు. కుముదవల్లిలో సర్పంచి భూపతిరాజు వంశీకృష్ణమరాజు ఆధ్వర్యంలో రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి జెండాను, సంక్షేమ బోర్డును పివిఎల్‌ ఆవిష్కరించి మాట్లాడారు. సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించిన ఘనత వైసిపికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు సత్తిబాబు, అబ్బులు పండు పాల్గొన్నారు.

➡️