జగ్గారావు మృతి తీరని లోటు

Jan 20,2024 22:58

ప్రజాశక్తి – గణపవరం
నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కృషి చేసిన సిపిఎం కేశవరం గ్రామ కమిటీ సభ్యులు మచ్చెట్టి జగ్గారావు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని సిపిఎం జిల్లా నాయకులు జక్కంశెట్టి సత్యనారాయణ అన్నారు. కేశవరంలో శనివారం నిర్వహించిన జగ్గారావు సంతాపసభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు సిపిఎం మండల కమిటీ సభ్యులు నరాలశెట్టి రామకృష్ణ అధ్యక్షత వహించారు. సత్యనారాయణ మాట్లాడుతూ జగ్గారావు దంపతులు 1983 నుంచి కేశవరంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగే ప్రజా పోరాటాల్లో చురుగ్గా పాల్గొనేవారన్నారు. ప్రజా పోరాటాల్లో పని చేసిన వ్యక్తులు భౌతికంగా దూరమైన నిరంతరం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. ఎంపిటిసి మాజీ సభ్యులు సుబ్బరాజు, సిఐటియు మండలాధ్యక్ష కార్యదర్శులు పి.గోవిందు, ఎం.పెంటారావు మాట్లాడుతూ కేశవరంలో జరిగిన వరి కోత యంత్ర పోరాటం, ఇళ్ల స్థలాల పోరాటాల్లో జగ్గారావు దంపతుల పాత్ర వెలకట్టలేదన్నారు. జగ్గారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మండల నాయకులు సోడదాసి సంజీవరావు, మామిడిశెట్టి వెంకటేశ్వరరావు, తోట మహాలక్ష్మి పాల్గొన్నారు.

➡️