పాలకొల్లులో బాపు విగ్రహం ఆవిష్కరణ

ప్రజాశక్తి – పాలకొల్లు

పాలకొల్లు పెయింటర్స్‌ అండ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాపు విగ్రహాన్ని శాసనమండలి ఛైర్మన్‌ మోషేనురాజు శుక్రవారం ఆవిష్కరించారు. శుక్రవారం మార్కెట్లో సంఘం భవనం వద్ద ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్‌ యుగంలో కళాకారుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. బాపు విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కళాకారులు మరో 10 మంది కళాకారులను ప్రోత్సహిం చాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి ఇన్‌ఛార్జి గుడాల గోపి, యడ్ల తాతాజీ, సంఘం అధ్యక్షులు నీలం రవి, కార్యదర్శి సమతం చంద్రరావు, కోశాధికారి బొప్పే సాంబమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపు చిత్రకళా పోటీలు నిర్వహించారు.

➡️