పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

ప్రజాశక్తి – పోడూరు

మండలంలో పలు పోలింగ్‌ కేంద్రాలను శనివారం ఆచంట రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వి.స్వామినాయుడు పరిశీలించారు. పోడూరు, కవిటం, జగన్నాధపురం పండితవిల్లూరు, మినిమించిలిపాడులో ఆయన పర్యటించి పోలింగ్‌ కేంద్రాలను తనిఖీచేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద మరుగుదొడ్ల సదుపాయం, వికలాంగులకు ర్యాంపులు, తదితర సదుపాయాలు సక్రమంగా ఉన్నదీ, లేనిది ఆయన పరిశీలించి రెవెన్యూ అధికారులకు సూచనలిచ్చారు. ఆయన వెంట తహశీల్దార్‌ ఆర్‌వి.కృష్ణారావు, డిటిడి.రాజేష్‌, ఆర్‌ఐ కె.రాంబాబు, వి.త్రిమూర్తులు, విఆర్‌ఒలు పాల్గొన్నారు.

➡️