టెరజ్జ రెస్టారెంట్‌ ప్రారంభం

ప్రజాశక్తి – ఏలూరు సిటీ

ఏలూరులోని జెడ్‌పి ఆఫీస్‌ ఎదురుగా టెరజ్జ రెస్టారెంట్‌ను శుక్రవారం నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్‌పి ఛైర్మన్‌ గంటా పద్మశ్రీ, నగర మున్సిపాలిటీ కోఆప్షన్‌ సభ్యులు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు హాజరయ్యారు. ముందుగా గంటా పద్మశ్రీ, ఎస్‌ఎంఆర్‌ పెద్దబాబు రిబ్బన్‌ కట్‌ చేసి రెస్టారెంట్‌ను ఓపెన్‌ చేశారు. అనంతరం కేక్‌ కటింగ్‌ చేసి రెస్టారెంట్‌ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ రియాజ్‌ మాట్లాడుతూ రాజారావు, మౌలాలి భాగస్వామ్యంగా ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం అన్నారు. ఈ రెస్టారెంట్‌ను ఆహార ప్రియుల కోసం మంచి రుచులతో, మంచి ఇంటీరియర్‌తో ఆహ్లాదకరంగా ఏర్పాటు చేశారని చెప్పారు. రెస్టారెంట్‌లో మంచి నాన్‌ వెజ్‌తో కూడిన బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ రెస్టారెంట్‌లో ఫుడ్‌ టేస్ట్‌ చేయడం ఏలూరు నగర వాసులకి మంచి అనుభూతి కలిగిస్తుందని, ప్రతి ఒక్కరూ టెరజ్జ రెస్టారెంట్‌లో ఫుడ్‌ని టేస్ట్‌ చేసి ఆస్వాదించగలరని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ విభిన్నమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో సౌత్‌ ఇండియన్‌ వెజ్‌ తాళి, నాన్‌ వెజ్‌ తాళి, చిట్టి గారే చికెన్‌ కర్రీ, మటన్‌ కీమా కిచిడి, బిర్యాని, నాన్‌ వెజ్‌ స్టార్టర్స్‌ వంటి అనేక రకాల వెరైటీస్‌ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం రెస్టారెంట్‌ను ప్రారంభించిన రాజారావు, మౌలాలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

➡️