బాల్య వివాహాలు చట్టరీత్య నేరం

Dec 2,2023 18:38

ప్రజాశక్తి – యలమంచిలి
బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని చించినాడ సర్పంచి దంగేటి రాజమణి అన్నారు. మండలంలోని చించినాడ గ్రామంలో పాలకొల్లు ప్రాజెక్టు ఆధ్వర్యంలో బేటి బచావో-బేటి పడావో కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సర్పంచి రాజమణి మాట్లాడుతూ గతంతో పోలిస్తే బాల్య వివాహాలు చాలావరకు తగ్గుముఖం పట్టినప్పటికీ అక్కడక్కడ ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నారు. బాల్య వివాహాలు జరిపిస్తున్నట్లు ఎవరి దృష్టికి వచ్చినా మహిళా పోలీసుకు గాని, స్కూల్లో ప్రధానోపాధ్యాయులకు గాని సమాచారం అందించాలని గ్రామస్తులకు ఆమె సూచించారు. అనంరతం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు నల్లి సంధ్యారాణి, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు రజిని, భారతి, సుజాత, సత్య జ్యోతి పాల్గొన్నారు.

➡️