భీమవరంలో నేత్ర వైద్య శిబిరం

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

భీమవరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ మ్యాక్సీవిజన్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ భీమవరం వారి సహకారంతో గురువారం నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో విద్యార్థులకు రెటీనా, కాట్రాక్ట్‌, గ్లూకోమా మొదలకు పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు అవసరమైన వైద్య సలహాలు అందజేశారు. సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ కొప్పర్తి సురేష్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ఎబిఎస్‌ఆర్‌.మనోహర్‌, ఎకడమిక్‌ డీన్‌ కె.భాస్కరరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️