మహిళలకు చీరల పంపిణీ

ప్రజాశక్తి – కాళ్ల

మోడీలో ఎస్‌టియు 75 వసంతాల వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఎస్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు సాయివర్మ ఆర్థిక సహకారంతో పది మంది మహిళలకు మంగళవారం చీరలు పంపిణీ చేశారు. మోడీలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా సాయివర్మ పనిచేస్తున్నారు. ఈ మేరకు పాఠశాలలో పని చేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు, విద్యా వాలంటీర్‌, అంగన్‌వాడీ సిబ్బందికి కలిపి మొత్తం పది మంది మహిళలకు దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టియు నాయకులు వేగేశ్న జానకి రామరాజు, జిల్లా కార్యదర్శి సిహెచ్‌.మోహన్‌బాబు, ఎస్‌టియు మండల ముఖ్యనాయకులు పెరుమాళ్ల ప్రసాద్‌, వీరమల్లు సుబ్రహ్మణ్యం, ప్రధానోపాధ్యాయుడు ఆర్‌.రవికుమార్‌ పాల్గొన్నార

➡️