రాబోయేది టిడిపి ప్రభుత్వమే : ఎంఎల్‌ఎ రామరాజు

ప్రజాశక్తి – కాళ్ల

రాబోయేది టిడిపి ప్రభుత్వమేనని, 2024లో టిడిపి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఎంఎల్‌ఎ మంతెన రామరాజు తెలిపారు. జువ్వలపాలెంలో సోమవారం ఎంఎల్‌ఎ మంతెన రామరాజు భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మంతెన రామరాజు మాట్లాడుతూ భవిష్యత్తుకు గ్యారెంటీలో వాగ్దానాలు తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000, ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి నెలకు రూ.1500, దీపం పథకం కింద ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు తదితర సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హులందరికీ లబ్ధి చేకూరే విధంగా అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి టిడిపి కట్టుబడి ఉంటుందని తెలిపారు. అనంతరం గ్రామంలో పాదయాత్రగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుండాబత్తుల వెంకట నాగేశ్వరరావు, గోకరాజు నాగరాజు, మాజీ ఎంపిటిసిలు నడింపల్లి విశ్వనాధరాజు, బొత్స గణేష్‌, దాసరి దాలినాయుడు పాల్గొన్నారు.

➡️