వేతనాలు పెంచాలని కార్మికుల ధర్నా

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలోని ఫుడ్‌ ఫ్యాట్స్‌, ఫెర్టిలైజర్స్‌ (త్రీఎఫ్‌) ఇండిస్టీలో పని చేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని సిఐటియు నాయకులు కర్రి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కార్మికులు ఫ్యాక్టరీ వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ త్రీఎఫ్‌ ఇండిస్టీలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు పెంచి ఐదేళ్లు అయిందని, వేతన ఒప్పందం పూర్తయి సంవత్సరం అవుతున్నప్పటికీ యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందన్నారు. మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. త్రీఎఫ్‌ యాజమాన్యం దిగి వచ్చి వెంటనే కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో త్రీఎఫ్‌ ఇండిస్ట్రీ కార్మిక నాయకులు టి.గణేశ్వరరావు, పెనుమాక శ్రీను, మాకా శ్రీనివాస్‌, కనకరాజు పాల్గొన్నారు.

➡️