4 వేల మంది పిల్లలతో బాలోత్సవం

ప్రజాశక్తి – భీమవరం

ఈ నెల 30, 31వ తేదీల్లో చింతలపాటి బాపిరాజు ఉన్నత పాఠశాలలో 4 వేల మంది పిల్లలతో బాలోత్సవం పోటీలకు ఏర్పాటు చేసినట్లు వసుధ ఫౌండేషన్‌ కార్యదర్శి మంతెన కృష్ణంరాజు, భీమవరం బాలోత్సవం కమిటీ అధ్యక్షులు ఇందుకూరి ప్రసాదరాజు అన్నారు. శ్రీరామపురంలో గాంధీ కస్తూరిభా భవనంలో భీమవరం బాలోత్సవం కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. చింతలపాటి బాపిరాజు ఉన్నత పాఠశాలలో బాలోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించారు. నాలుగు వేల మందితో నిర్వహించనున్న పోటీల్లో పది అంశాల్లో విద్యా సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నామన్నారు. భీమవరం పట్టణం, భీమవరం రూరల్‌, పాలకోడేరు, ఉండి, వీరవాసరం, కాళ్ల మండలాల పరిధిలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవ కమిటీ సభ్యులు కెబివి.మురళీకృష్ణ, పి.సీతారామరాజు, షేక్‌ వలీ, జి.జేమ్స్‌, పివి.సూర్యనారాయణ, సిహెచ్‌.పట్టాభిరామయ్య, కె.అశోక్‌, పి.శ్రీనివాసరాజు, కైఎస్‌.సిహెచ్‌ సాయిరామ్‌, రేపాక వెంకన్నబాబు, చైతన్యప్రసాద్‌, కె.చంద్రరావు పాల్గొన్నారు.

➡️