పండుగలు చేసుకోకుండా రోడ్డుపైనే ఉన్నాం…

Jan 12,2024 15:11 #West Godavari District
anganwadi workers strike 32nd day in wg

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గత 32 రోజులగా సమ్మె చేస్తున్నప్పటికి సమస్యలు పరిష్కరించకుండా వారిపై ఎస్మా చట్టం అమల్లోకి తీసుకురావడం చాలా దుర్మార్గపు చర్యని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వవాన్ని దుయ్యబట్టారు. శుక్రవారం స్థానిక తసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 32వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు కర్రి నాగేశ్వరరావు,అంగన్వాడీ వర్కర్స్ యూనియాన్ ప్రాజెక్టు అధ్యక్షరాలు దీన స్వరూపారాణిలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ పెంచాలని, కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఏవిధమైన పండుగలు చేసుకోకుండా అంగన్వాడీలు రోడ్డున పడ్డారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు జరిపి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిసష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాయకులు కరి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కమిటీ నాయకులు యడవల్లి వెంకట దుర్గారావు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️