మానవతా ఆధ్వర్యంలో చలివేంద్రాలు

Mar 30,2024 16:02 #West Godavari District

ప్రజాశక్తి-గణపవరం : మండలంలో మానవత సంస్థ ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మానవతా జిల్లా కన్వీనర్ కాకర్ల వినాయక తెలిపారు. శనివారం మానవతా సంస్థ మండల కమిటీ సమావేశం స్థానిక కన్యకా పరమేశ్వరి వర్తక సంఘ భవనంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సమావేశానికి సంస్థ అధ్యక్షులు కంటేటి కృష్ణంరాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో వినాయక మాట్లాడుతూ అర్థవరం హై స్కూల్ లో విద్యార్థులకు మంచినీటి సౌకర్యం కలిగించడానికి వీలుగా 18 వేల రూపాయలు ఆర్వో ప్లాంట్ కి ఇవ్వడం జరిగిందని చెప్పారు. అలాగే గణపవరం స్మశాన వాటికిలో ఉన్న పీజర్ల. కాపలాదారుడు గంజి వెంకన్నకు వేతనం కింద 6000 రూపాయలు చెక్కును అందజేసినట్లు చెప్పారు. సంస్థ ఆధ్వర్యంలో గత ఏడాదిలో జరిగిన కార్యక్రమాలు జమా ఖర్చులు కేంద్ర కమిటీకి అందజేసినట్లు చెప్పారు. ఈ సమాజంలో సంస్థ కార్యదర్శి ఎం చిరంజీవి రావు ఉపాధ్యక్షులు వంకాయల రామారావు కమిటీ సభ్యులు ఎండి రఫీ సాగిరాజు సుబ్బరాజు బొడ్డు శ్రీనివాసరావు పెరుమాళ్ ఆంజనేయులు దండు బంగారు రాజు పాల్గొన్నారు.

➡️