ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

Apr 3,2024 11:38 #West Godavari District

పాలకోడేరు ఎస్ ఐ శ్రీనివాసరావు

ప్రజాశక్తి-పాలకోడేరు : రానున్న రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని దీనికి పోలీస్ శాఖ పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని పాల్గొని ఎస్ఐ నాళం శ్రీనివాసరావు అన్నారు. పాలకోడేరు, కుమాధవల్లి కోరుకొల్లు గ్రామాల్లో పాలకోడేరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్ర బలగాలతో బుధవారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగంపై ఎవరు ఎటువంటి అపోహలు పోకుండా ఉండాలని అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సై శ్రీనివాసరావు మాట్లాడారు. ఎన్నికల్లో నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా తోడుంటారని భరోసా కల్పించారు. ప్రజలు అధైర్య పడకుండా రాజ్యాంగం ద్వారా సంక్రమించిన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శక నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీసులు ప్రజలకు పూర్తి సహకారం అందించడం జరుగుతుందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పక్షాలు, ప్రజలు పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

➡️