పిఆర్‌పి ఇంజక్షన్‌తో మోకాళ్ల నొప్పులు దూరం

శ్రీకృష్ణ హాస్పటల్‌ ఆర్థో, స్పైన్‌ అండ్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ బి.కృష్ణ

ప్రజాశక్తి – ఏలూరు

పిఆర్‌పి ఇంజక్షన్‌ చేయించుకోవడం ద్వారా మోకాళ్ల నొప్పికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని శ్రీ కృష్ణ హాస్పటల్‌ ఆర్థో, స్పైన్‌ అండ్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ బి.కృష్ణ తెలిపారు. ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి వయస్సుతో నిమిత్తం లేకుండా మోకాలికి ఎక్స్‌రే తీయించాలన్నారు. ఈ పరీక్ష ద్వారా మోకాళ్ల అరుగుదలను స్టేజ్‌-1, స్టేజ్‌-2, స్టేజ్‌-3 అని మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తామని చెప్పారు. అయితే ఒకటి, రెండు దశల్లో మాత్రమే పిఆర్‌పి ఇంజక్షన్‌ చేయించుకోవాలని, మూడో దశలో ఈ ఇంజక్షన్‌ చేయించుకోకూడదని తెలిపారు. ఈ పిఆర్‌పి ఇంజక్షన్‌ వల్ల ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా రావని తెలిపారు. ఇంజక్షన్‌ చేసేటప్పుడు నొప్పి లేకుండా చేసే వైద్య విధానమని తెలిపారు. ప్రతి పేషెంట్‌ వారి మోకాలి అరుగుదల స్టేజ్‌ బట్టి ఈ ఇంజక్షన్‌ చేయాలా లేక రెండో స్టేజ్‌లో చేయాలా అనేది నెల లేదా రెండు నెలల వ్యవధిలో నిర్థారిస్తామని తెలిపారు. ఈ ఇంజక్షన్‌ మోకాలికి మాత్రమేగాక మోచేతికి, భుజానికి కూడా చేసుకోవచ్చని తెలిపారు. ఇంజక్షన్‌ ముందుగానే చేయించుకుంటే మోకాళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. పిఆర్‌పి ఇంజక్షన్‌ చాలా తేలికైన పద్ధతి అన్నారు. ఈ ఇంజక్షన్‌ను చేయించుకోవడానికి భయపడనవసరం లేదని చెప్పారు. ఇంజక్షన్‌ చేయించుకుని గంటలో వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లిపోవచ్చని తెలిపారు. పిఆర్‌పి మందు కాదని, కేవలం రోగి రక్తం నుంచి వేరు చేయు ప్లాస్మా కణాల సముదాయం మాత్రమేనని తెలిపారు.

➡️