చిన్నమలంలో వివాహిత ఆత్మహత్య

May 15,2024 22:10

ప్రజాశక్తి – పెనుగొండ
మండలంలోని చిన్నమలం గ్రామం ఎస్‌సి కాలనీలో చోడగిరి మనిష (29) ఇంటి దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చినమాలం గ్రామానికి చోడగిరి హరికృష్ణ, మనీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో దంపతులిద్దరు పిల్లలతో కలిసి బుధవారం ఉదయం పేరుపాలెం బీచ్‌ వెళ్తామనుకున్నారు. అయితే హరికృష్ణ బయటకు వెళ్లి ఆలస్యంగా వచ్చి బీచ్‌కు వెళ్తామని భార్యకు చెప్పాడు. దీంతో ఆలస్యమైందని, తాను బీచ్‌కు రానని మనిష చెప్పింది. దీంతో కుమార్తెలిద్దరితో కలిసి హరికృష్ణ బీచ్‌కు బయలుదేరాడు. దీంతో మనస్తాపానికి గురైన మనిష ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు హరికృష్ణకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. దీంతో హరికృష్ణ పిల్లలతో కలిసి హుటాహుటిన ఇంటి వచ్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ఏరియా ఆసుపత్రి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ షేక్‌ సుభాని తెలిపారు.

➡️