శిశు మరణాలను నివారించాలి : జెసి

Apr 5,2024 21:51

ప్రజాశక్తి – భీమవరం
శిశుమరణాలను జీరో శాతం చేయడమే లక్ష్యమని జాయింట్‌ కలెక్టర్‌ సివి.ప్రవీణ్‌ఆదిత్య అన్నారు. ఏరియా హాస్పిటల్‌లో స్వచ్ఛ తల్లిపాలు బ్యాంకు ఏర్పాటు కోసం గదులను ఆయన డిసిహెచ్‌ డాక్టర్‌ పి.సూర్యనారాయణ, ఏరియా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.మాధవీకళ్యాణితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ రాష్ట్రంలో కాకినాడ ఏరియా హాస్పిటల్‌లో మాత్రమే స్వచ్ఛ తల్లిపాల బ్యాంకు ఉందని చెప్పారు. భీమవరం ఏరియా హాస్పిటల్‌లో ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలని డిసిహెచ్‌, సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

➡️