తిరగబడ్డ మానవతా శాంతి రథం

Dec 17,2023 15:29 #West Godavari District
road accident manavata vehicle

ప్రజాశక్తి-నల్లజర్ల(పగో) : నల్లజర్ల మండలం అచ్చన్న పాలెం ఎస్సీ కాలనీ వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై మానవత శాంతిరథం తిరగబడింది వాహనంలో వృద్ధుని మృతదేహంతో పాటు బంధువులు ముగ్గురు డ్రైవరు ఉన్నారు. ఈ ప్రమాదంలో బంధువుల్లో ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా వారిని నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా ధర్మాజీ గూడెం నుండి కొవ్వూరులో అంత్యక్రియలు నిర్వహించేందుకు లింగపాలెం మండలం మానవత శాంతిరథంపై వెళుతూ ఉండగా అచ్చన్న పాలెం వద్ద ముందుగా వెళుతున్న లారీ డ్రైవర్ మీదకు వస్తుండటంతో తప్పించే క్రమంలో శాంతి రథాన్ని పక్కకు మళ్లించే క్రమంలో డివైడర్ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా తిరగబడింది. ఈ క్రమంలో ఫ్రీజర్ బాక్స్ తో మృతదేహం రోడ్డుపై పడడంతో వాహనంలోని బంధువులు ఇద్దరుకు గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్ లో వారిని ఆసుపత్రికి తరలించారు.

➡️