ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి

 తుళ్లూరు: గుంటూరు పార్లమెంట్‌,తాడికొండ అసెంబ్లీ నియోజక వర్గ ఇండియా వేదిక అభ్యర్థులు జంగాల అజరు కుమార్‌, మంచాల సుశీల్‌ రాజాను గెలిపించాలని సిపిఎం,సిపిఐ రాజ ధాని డివిజన్‌ నాయకులు ఎం.రవి, ముప్పాళ్ల శివ శంకరరావు కోరారు. సోమవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిపిఎం,సిపిఐ నాయకులతో పాటు కాంగ్రెస్‌ అభ్యర్ధి సుశీల్‌ రాజా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచా రంలో అనుసరించాల్చిన విధానాలపై చర్చించారు. ఈ సంద ర్భంగా రవి మాట్లాడుతూ, ప్రజాస్వామం మనుగడ సాగిం చాలంటే కేంద్రంలో బిజెపిని,రాష్ట్రంలో నియంతృత్వ పోకడ లతో రాష్ట్రాన్ని తిరోగమన దిశగా పయనింపజేస్తున్న వైసిపిని ఓడించాలని అన్నారు.ఎనిమిది కేంద్ర బడ్జెట్లలో అమరావతి రాజధానికి పైసా నిధులు కేటాయించకుండా బిజెపి మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్‌,సిపిఐ అభ్యర్థుల గెలుపు నకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. శివ శంకర రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై టిడిపితో సిపిఐ, సిపి ఎం కలిసి పని చేశాయని, ఏమాత్రం సంప్రదించకుండా ఎన్ని కలలో బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకుందని అన్నారు. కేం ద్రంలో బిజెపిని, రాష్ట్రంలో వైసిపి, కూటమిని ఓడించాల్చిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి సుశీల్‌ రాజా మాట్లాడుతూ బిజెపి పాలనలో దేశంలో మతతత్వ ధోరణులు పెచ్చరిల్లుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయ కులు గడ్డం కష్ణ,షేక్‌ జానీ,పి వెంకటేశ్వర్లు,కె ఆంజనేయులు, సిపిఐ నాయకులు కె వి వి ప్రసాద్‌,బైరాపట్నం రామకష్ణగ్రామాల్లో ప్రచారం గుంటూరు పార్లమెంట్‌ సిపిఐ అభ్యర్థి జంగాల అజరు కుమార్‌,తాడికొండ అసెంబ్లీ నియోజక వర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి మంచాల సుశీల్‌ రాజా గెలుపును కాంక్షిస్తూ సిపిఐ, సిపిఎం నాయకులు సోమవారం రాజధాని గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు.

➡️