ఎపి ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

Mar 8,2024 16:46 #Vizianagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎపి ఎన్జీవో అసోసియేషన్ విజయనగరం జిల్లా ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీఓ హోమ్ లో మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు జరిగాయి. విజయనగరంలో ఉన్న, అన్ని శాఖలు నుండి సుమారు గా 300 మంది మహిళా ఉద్యోగినిలు హాజరు అయ్యారు. ఆటపాటలతో చాలా ఉత్సాహం గా సంతోషం గా గడిపారు. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిధులుగా ఐసిడిఎస్ పేది బి శాంత కుమారి, మహారాజ హాస్పిటల్ సూపరింటెండెంట్ అనిలా సునందిని, ఎపి జి ఎల్ ఐ డైరెక్టర్జి హైమావతి, జిల్లా ఆడిట్ అధికారి బి అరుణ కుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటల పోటీలలో గెలుపొందిన మహిళలు కు బహుమతి ప్రదానం చేశారు. ఎన్జీఓ మహిళా విభాగం తరుపున ఆర్.శ్రీస్వప్న, ఆదిలక్ష్మి, ప్రసన్న కుమారి, వి.కోటేశ్వరి పి.లత, పి.శివలక్ష్మి జ్యోతిర్మయి, శ్రీ విద్య, రాధిక, తదితరులు జిల్లా పట్టణ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జిల్లా కార్యదర్శి సురేష్, పట్టణ అధ్యక్షులు రాజు, సుధ, చంద్ర శేఖర్ ఉపాధ్యక్షులు ఆనంద్ కుమార్, కె బి శ్రీను, శ్రీధర్ బాబు, గోపీనాథ్ పాల్గొన్నారు.

➡️