ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి : బూచేపల్లి

ప్రజాశక్తి-దర్శి : వైసిపి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా మేలు జరిగినట్లు వైసిపి దర్శి నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. దర్శి నగర పంచాయతీ పరిధిలోని దేవతి వెంకటసుబ్బయ్యనగర్‌లో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. వారితో నడిచి సమస్యలు తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్లకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆటో కార్మికులు తోపాటు అన్ని రంగాల కార్మికులందరూ వైసిపి ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆయన కోరారు. తొలుత ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దర్శి మండలంలోని రామచంద్రపురం, ఎర్రఓబనపల్లి గ్రామాలలో మన ఊరికి మన శివన్న అనే కార్యక్రమం జిల్లా పరిషత్‌ చైర్స్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, నందినితో కలిసి నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతుల కోసం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి, అన్ని విధాల రైతులను ఆదుకున్నట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయంగా ప్రతి ఏడాది రూ.13, 650 ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని విధాల మేలు జరుగుతుందన్నారు. గ్రామాలలో తాగునీరు, రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు వైసిపి ప్రభుత్వం చేసినట్లు తెలిపారు. తమ కుటుంబం గత 20 ఏళ్లుగా దర్శి నియోజకవర్గంలోని ప్రజలందరికీ అన్ని విధాల సేవలందిస్తున్నట్లు తెలిపారు. తన తండ్రి, తన హయాంలో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివద్ధి చేశామన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో టిడిపికి ఓటేస్తే పేదలందరూ నష్టపోతారని తెలిపారు. సచివాలయ వద్ద వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటివద్దకే అందుతున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, వైసిపి ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన పలువురు వైసిపిలో చేరారు. బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కట్టికోట హరీష్‌, సర్పంచులు కైపు నాగేశ్వరమ్మ, సుబ్బారెడ్డి, చిన్నిరెడ్డి, నాయకులు బాదం రమణారెడ్డి, నాగిరెడ్డి, నాగేశ్వరరావు, బక్కిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️