చిన్నారులతో పనిచేయించడం నేరం

ప్రజాశక్తి-కడప షాపు యజమానులు చిన్న పిల్లలతో పనిచేయించుకోవడం చట్ట రీత్యా నేరమని సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబా ఫక్రుదీన్‌ పేర్కొన్నారు. శనివారం వైవీస్ట్రీట్‌లో ఉన్న దుకాణాలను లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు, పోలీసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణ యజ మానులు వయసు ధ్రువీకరణ పత్రాలు తీసుకొని షాపులలో పని చేయిం చుకోవాలన్నారు. ఉచిత న్యాయ సహాయం మొదలగు అంశాలను వివరించారు. కార్యక్రమంలో చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ ఎన్‌.హరిబాబు, డిప్యూటీ చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ ఎమ్‌. శాంత, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ పి.మనోహర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం పాల్‌ జాన్సన్‌, జి శ్రీనివాసరెడ్డి, కె మునుస్వామి, దిశా పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నిర్మలాదేవి, షాపు యజమానులు పాల్గొన్నారు.

➡️