పనిచేసే చోట లైంగిక వేధింపులు లేకుండా చూడాలి : కమీషనర్ మల్లయ్య నాయుడు

Feb 6,2024 17:00 #Vizianagaram incident

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పనిచేసే చోట లైంగిక వేధింపులు జరగకుండా చూసుకోవాలి మున్సిపల్ కమిషనర్ మల్లయ్య నాయుడు . మంగళవారం నాడు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విజయనగరం అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ప్రసన్న ఆధ్వర్యంలో అర్బన్ మరియు రూరల్ ఏరియాలో ఉన్న మహిళా సంరక్షణ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది .ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మల్లయ్య నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, నర్సింగ్ హోమ్ లో, పరిశ్రమలు, సహకార సంస్థలు క్రీడా సంస్థలు సేవా సంస్థలు విద్యాసంస్థలు లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఫిర్యాదుల అంతర సమాఖ్య కార్యాలయ స్థాయిలో ఏర్పాటు చేయాలి. మరియు మహిళా సంరక్షణ కార్యదర్శులు అందరూ స్కూళ్లలోనూ కాలేజీలలోను పిల్లలకు సఖి గ్రూప్ సమావేశాలు నిర్వహించవలనని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవగాహన కల్పించవలెనని తెలియజేశారు. సిడిపిఓ ప్రసన్న మాట్లాడుతూ పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు చట్టం 2013 ఉద్దేశించి ఈ చట్టాన్ని న్యాయబద్ధంగా నిర్వహించగలగేలా ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. అందుకు మహిళా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్ తిరుమల రావు, వన్ స్టాప్ సెంటర్ నుంచి రమాదేవి, వెంకటలక్ష్మి, మరియు ఐసిడిఎస్ సూపర్వైజర్లు తదితరులు హాజరు అయ్యారు.

➡️