మీ పిల్లలు భవిష్యత్తు మాదే

May 10,2024 20:43

ప్రజాశక్తి- మెరకముడిదాం : మీ పిల్లల భవిష్యత్తు మాదేనని, మీ పిల్లలు ఉన్నత చదువులు చదవాలన్నా, మహిళ సంక్షేమం కొనసాగాలన్నా ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైసిపిని గెలిపించాలని మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్‌పి చైర్మన్‌ మజ్జిశ్రీనివాసరావు కోరారు. శుక్రవారం మండలంలోని కొర్లాం, యాడిక, గరుగుబిల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగన్‌ మోహనరెడ్డి ఇస్తున్న పథకాలు అన్ని మీ ఇంటి వద్దకే చేరాలన్నా, మీ పిల్లలు చదువు భాదత్య ఒక్క పైసా కూడా తల్లి తండ్రులు తీయకుండా ప్రభుత్వమే భరించే విధంగా కొనసాగాలన్నా, మహిళలు సంతోషంగా ఉండాలన్నా, రైతులు ఎక్కడికి వెళ్ళ కుండా మీ గ్రామంలోనే ఎరువులు, విత్తనాలు, పొందాలన్నా, ఇంటి వద్దకే పింఛను రావాలన్నా మళ్లీ వైసిపిని గెలిపించాలన్నారు. లేనిపోని కళ్ళ బొల్లి కబుర్లు, మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలన్న చంద్రబాబు మాటలు నమ్మి మీ పిల్లలు భవిష్యత్‌, మీ సంక్షేమాన్ని చేతులారా నాశనం చేసుకోవద్దని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు తాడ్డి వేణుగోపాలరావు, ఎస్‌వి రమణరాజు, కోట్ల వెంకటరావు, బూర్లె నరేష్‌ కుమార్‌, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంభోగాపురం: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే సిఎం జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలోని సవరవిల్లి పంచాయతీలో వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, సర్పంచ్‌ ఉప్పాడ విజయభాస్కర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కోలహాలంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఐదేళ్ల వైసిపి పాలనలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్దే లక్ష్యంగా పనిచేశామన్నారు. ఈ నెల 13 జరగనున్న ఎన్నికల్లో మంచి చేసే వైసిపి ప్రభుత్వానికే మద్దతిచ్చి మరోసారి తమను ఎమ్మెల్యేగా, ఎమ్‌పిగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరక్టర్‌ ఉప్పాడ శివారెడ్డి, వైస్‌ ఎంపిపి రావాడబాబు, ఎంపిటిసి పట్న తాతీయులు, నాయకులు పడాల బానుప్రకాష్‌, మాజీ జెడ్‌పిటిసి బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మండల జెసిఎస్‌ కన్వీనర్‌ బైరెడ్డి యర్రప్పలనారాయణరెడ్డి, పడాల శ్రీనివాసరావు, మండల యువజన అధ్యక్షులు సుందర హరీష్‌, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి: ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు టిడిపి ఇస్తున్న బూటకపు హామీలను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు కోరారు. మండలం లోని కమ్మవలస, ముత్తావలస, కొండదేవుపల్లిలో శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల్లో ర్యాలీ చేసి ఎన్నికల సభ నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు బూటకపు హామీలు ఇస్తున్నారని, నమ్మి మోసపోవద్దన్నారు. ఎన్నికల హామీలను వైసిపి ప్రభుత్వం 99శాతం అమలు చేసిందని, రానున్న ఎన్నికల్లో వైసిపిని గెలిపించాలని కోరారు. ప్రచారంలో జెడ్‌పిటిసి ఎస్‌.శాంతికుమారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.వేపాడ: వైసిపితోనే అవినీతి రహిత పాలన సాధ్యమని శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం మండలంలోని చిన్నగుడిపాల, దబ్బిరాజు పేట, చామలాపల్లి, గుడివాడ, కరకవలస, జాకేరు, పెదకృష్ణరాజపురం, రామస్వామిపేట, బొద్దాం, ఓబులయ్యపాలెం, ముకుందపురం, పాటూరు, కెజిపూడి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలన్నా సిఎం జగన్మోహన్‌ రెడ్డికి మళ్లీ అవకాశం కల్పించాలని, అది మన అందరి బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు ఎం.జగ్గుబాబు, ఎంపిపి డి.సత్యవంతుడు, డిసిసిబి చైర్మన్‌ వి.వి.చిన్న రామునాయుడు, జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు, ఎఎంసి చైర్‌పర్సన్‌ ఎం.కస్తూరి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఎన్‌.వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.కొత్తవలస: మండంలోని గులివిందాడ, రాజపాత్రుని పాలెం, చీపురువలస, మిందివలస, ఎం. రామచంద్రపురం గ్రామాల్లో ప్రచారం చేశారు. నెక్కల నాయుడుబాబు, ఎంపిపి గోపమ్మ, జెడ్‌పిటిసి శ్రీదేవి, పిఎసిఎస్‌ అధ్యక్షులు గొరపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.

➡️