ఎరుకొండలో వైసిపి ప్రచారం

Apr 7,2024 21:23

ప్రజాశక్తి – పూసపాటిరేగ: బకెట్టు పంచి ప్రజలును వంచించి ఓట్లు రాబట్టుకోవాలనే రాజకీయ నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. ఆదివారం మండలంలోని ఎరుకొండ పంచాయతీ పరిధిలో వైసిపి ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్బగా ఆయన ఇంటింటింటికి తిరిగి సంక్షేమ పథకాలు ఇస్తున్న వైఎస్‌ జగన్మొహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా, తనను ఎమ్మెల్యేగా, ఎంపిగా బెల్లాన చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు. డొక్కులు పంచిన అభ్యర్ధి కుల రాజకీయాలు చేయాలని చూస్తుందన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమం అందించే ప్రభుత్వానికి ప్యాన్‌ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో ఎంపిపి మహంతి కళ్యాణి, వైసిపి మండల అధ్యక్షలు పతివాడ అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వినర్‌ మహంతి శ్రీనివాసరావు, వైస్‌ ఎంపిపిలు అల్లాడ రమేష్‌, ఎన్‌. సత్యనారాయణ రాజు, నాయకులు మహంతి జనార్ధనరావు, పుప్పాల లక్ష్మినారాయణ, పసుపాం, ఎరుకొండ నాయకులు వాళ్లె ఆధినారాయణ, అచ్చెం నాయుడు, శాంతాటి శ్రీనువాసరావు, రమణ పాల్గొన్నారు. వైసిపి ఇంటింట ప్రచారంవేపాడ: మండలంలోని సింగరాయలో వైసిపి నాయకులు ఆదివారం సాయంత్రం ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ రామనాయుడు, జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు, గ్రామ సర్పంచ్‌, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎన్‌ వెంకట్రావు, ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్నారు. మరో అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తాతెర్లాం: మరోసారి ఎమ్మెల్యేగా తనకు అవకాశమిస్తే మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన ప్పలనాయుడు అన్నారు. మండలంలోని లోచర,్ల తెర్లాం మండల కేంద్రంలో ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ ప్రజలను తనకు ఓటు వేసి మళ్లీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల నాయకులు బాబ్జి రావు, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాసరావు, వైస్‌ ఎంపిపి సత్యనారాయణ, రామారావు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు

➡️