‘ఎంజెఆర్‌’లో ఘనంగా జెనిత్‌ 2కె24

ప్రజాశక్తి-పీలేరు పీలేరులోని ఎంజెఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో జెనిత్‌ 2కె 24 నేషనల్‌ స్టూడెంట్స్‌ టెక్నికల్‌ సింపోజియం ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం స్థానిక చిత్తూరు రోడ్డులోని కళాశాల ఆవరణంలో ఈ కార్యక్రమాన్ని జరిపారు. కార్యక్రమంలో వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలలకు చెందిన 128 విద్యార్ధులు హాజరయ్యారు. వారికి పేపర్‌, పోస్టర్‌ ప్రజెం టేషన్‌, టెక్నికల్‌, క్విజ్‌ పోటీలు నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను కళాశాల చైర్మన్‌ ఎంపి అవినాష్‌ కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ ఎన్‌. సుధా కర్‌రెడ్డి బహుకరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రద ర్శించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్‌ స్పందన పల్లి, కామెడియన్‌ రవికిషోర్‌, జబర్దస్త్‌ నటులు ముక్కు అవినాష్‌, తాగుబోతు రాజమౌళి హాస్య బందం హాస్యవల్లరి కార్యక్రమాలను ప్రదర్శించి విద్యా ర్థులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ ఎంపి.అవినాష్‌ కుమార్‌ రెడ్డి, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, కళాశాలలోని వివిధ విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️