పన్ను పోట్లు తగ్గించరా?

May 9,2024 04:40 #editpage

నేడు మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలతోనే ఎన్నికల్లో గెలుస్తామన్న భ్రమతో రాజకీయ పార్టీలు పోటాపోటీగా జనాకర్షక పధకాలను ప్రకటిస్తున్నాయి. ఏ ప్రభుత్వ రాయితీలైనా ఆసరా లేని నిరుపేదలకే దక్కాలి. ఐతే మరోవైపు వివిధ పన్నుల రూపంలో ప్రజానీకంపై భారం పెరుగుతూ పోతోంది. విద్యుత్‌, ఇంధన ధరలు, ఇంటి పన్నులు, బస్సు చార్జీల వంటివి భారీగా పెంచుతూ పోతుంటే సంచి లాభం చిల్లి పూడ్చింది అన్నట్లు వారు లబ్ధి పొందకపోగా, ఆ పథకాలను పొందని, ఆశించని సామాన్యులు ఈ అధనపు భారాలు మోయలేక పోతున్నారు. ప్రభుత్వాల అడ్డగోలు పన్నుల బాదుడుతో ప్రజలు అష్టకష్టాలూ పడుతూ కూడ ప్రశ్నించే నైతిక హక్కును ప్రలోభాల మాయలో కోల్పోతున్నారు. గతంలో చిన్నపాటి విద్యుత్‌ చార్జీలు, పెట్రోల్‌ చార్జీల పెంపు వంటి వాటిపై పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు జరిగాయి. ఆ పన్నుల బాదుడు తగ్గిస్తామని నిన్న మొన్నటి వరకూ చెప్పిన మన రాజకీయ నాయకులు ఆ ఊసే ఎత్తటం లేదు. పెరిగిపోతున్న ఈ పన్నుల భారం ఉపశమనం కోసం ఈ నేతలపై మరింత ఒత్తిడి చేద్దాం.

– తిరుమలశెట్టి సాంబశివరావు,
నరసరావుపేట

➡️