ఆ అవ్వే మరణిస్తే…

May 9,2024 04:55 #editpage

జీవితపు చరమాంకంలో
పింఛనుకై పోరాడుతూ
శోషతో చివరి శ్వాశ
మండుటెండలో కలుస్తున్నా
పట్టించుకున్న నాథుడెవ్వరు?
తమ జీవితం చివరిదాకా
ఇంట్లో భారం కాకూడదని
పోరాటం చేస్తూనే రాలిపోయే
పండుటాకులను కూడా
బలవంతంగా రాల్చుతున్న
రాజకీయ వైచిత్రి
కరడు కట్టిన మీ శత్రుత్వపు
అమానవీయ నైజం
మాటల యుద్ధం మాటున
ప్రాణాలకు విలువలేని
ప్రమాణాల ధ్యాసలేని
వికృత అధికార దాహం
రెండు శరభాల మధ్య నలిగిన
మేక పిల్ల తీరున
మీ అస్తిత్వ పోరాటంలో
మీరు సమిధగా మార్చిన
ఆ అవ్వే మరణించినప్పుడు
కంట నీరు కూడా
భానుడి కిరణాల ధాటికి
ఆవిరైపోయిన వైనం
ఆ పాపం ఎవ్వరిదన్న
ప్రశ్నకు సమాధానమేదీ?

– జంధ్యాల రఘుబాబు
9849753298

➡️