ఆ నిర్ణయం సరైంది కాదు : వెట్రిమారన్‌

Jan 17,2024 19:05 #movie, #nayanatara

నయనతార 75వ చిత్రంగా తెరకెక్కిన ‘అన్నపూరణి’ని నెట్‌ఫ్లిక్స్‌ నుంచి తొలగించడంపై తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ తీవ్రంగా ఖండించారు. ఈ చిత్రానికి తాను మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ‘నెట్‌ఫ్లిక్స్‌ నిర్ణయం సరైనది కాదు. ఇలా వ్యవహరించడం చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. ఒక సినిమాను అనుమతించడానికైనా.. తొలగించడానికైనా సెన్సార్‌ బోర్డుకు మాత్రమే అధికారం ఉంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ తీసుకున్న నిర్ణయం.. బోర్డు అధికారాన్ని ప్రశ్నించేలా ఉంది’ అని వెట్రిమారన్‌ వ్యాఖ్యానించారు. సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన ఓ అమ్మాయి.. మాంసాహార వంటలకు సంబంధించిన హౌటల్‌ పెట్టుకోవాలనుకున్న తన కలను ఎలా నెరవేర్చుకుంది అనే కథతో ‘అన్నపూరణి’ తెరకెక్కింది.

➡️