‘ఇంకా ఇంకా దూరమే…’ అంటున్న నాగార్జున

Jan 12,2024 08:17 #movie, #nagarjuna

నాగార్జున నటిస్తున్న ‘నా సామిరంగ’ చిత్రం నుండి తాజాగా మరో పాట విడుదలైంది. ‘ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే.. ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరవుతుంటే.. అంటూ ఎమోషనల్‌గా ఈ పాట సాగింది. ఈ పాటను మమన్‌ కుమార్‌, సత్య యామిని ఆలపించారు. ఎం ఎం కీరవాణి సాహిత్యంతో పాటు సంగీతం సమకుర్చారు. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ కథానాయికగా నటిస్తున్నారు. విజరు బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

➡️