ఎన్‌బికో109లో ఊర్వశి రౌతేలా..

Jan 31,2024 19:15 #movie, #urvasi routhula

బాలకృష్ణ, బాబీ కాంబినేషనల్లో తెరకెక్కుతోన్న ‘ఎన్‌బికో109’లో హీరోయిన్‌గా బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో తాను పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా ఊర్వశి రౌతేలా ప్రకటించారు. ఆ పాత్ర కోసం పాపులర్‌ బాక్సర్‌ కోనర్‌ మిక్‌ గ్రేగర్‌తో ట్రైనింగ్‌ సెషన్‌లో ఉన్న స్టిల్‌ను కూడా ఆమె పంచుకున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

➡️