కావాలనే అమ్మను దూరం పెట్టా : జాన్వీ కపూర్‌’

Dec 16,2023 08:25 #johnvi kapoor, #movie

నేను శ్రీదేవి కుమార్తెను కావడంతోనే నాకు అవకాశాలు వచ్చాయని అందరూ అనుకున్నారు. అందుకే అమ్మను దూరం పెట్టాను. ఆమె నుంచి ఎలాంటి సాయం తీసుకోకూడదనుకున్నాను. ఆమెలా కాకుండా భిన్నంగా నటించి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించాను’ అని హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన తల్లితో తాను సినీరంగ ప్రవేశం సమయంలో ఏ విధంగా వ్యవహరించానో వివరించారు. ‘నా తొలి సినిమా సెట్స్‌కు కూడా ఆమెను రావొద్దనీ, నాకు సాయం చేయద్దని చెప్పాను. ఆమె కూతురిగా ఇండిస్టీకి పరిచయమవ్వడంతో ఎందుకో అభద్రతా భావానికి లోనయ్యేదాన్ని. ఆమె సలహాలు కూడా తీసుకునేదాన్ని కాదు. నేనెంత హాస్యాస్పదంగా ఆలోచించానో ఆ తర్వాత అర్థమైంది. ఇప్పుడు ప్రతి విషయం ఆమెకు చెప్పాలనిపిస్తుంది. ‘అమ్మా.. షూట్‌ ఉంది. త్వరగా రా’ అని ఆమెతో చెప్పినట్లు అనిపిస్తుంది. ఆమె కూతురినైనందుకు ఇప్పుడు ఎంతో గర్వపడుతున్నా. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ అని అభిమానులు అంటుంటే ఆనందంగా ఉంది’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్‌ హీరో నటిస్తున్న దేవర చిత్రంలో జాన్వీ హీరోయిన్‌. కొరటాల శివ దర్శకుడు. తొలిభాగం దేవరా1 ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.

➡️