కోలీవుడ్‌లో నాలుగు చిత్రాల మధ్య పోటీ

Jan 31,2024 19:40 #movie

ఈనెల 2 రెండోతేదీన శుక్రవారం నాడు నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. హాస్యనటుడు సంతానం నటించిన ‘వడకుప్పట్టి రామస్వామి’ ఒకటి. సంతానాంకార్తీక్‌ యోగి కాంబినేషన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. హీరోయిన్‌గా మేఘా ఆకాష్‌ నటించారు. పూర్తి హాస్యరస భరితంగా రూపొందించామని ఇటీవల చిత్ర నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. విదార్థ్‌-పూర్ణ నటించిన చిత్రం డెవిల్‌. దర్శకుడు మిష్కిన్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం ఇది. మిష్కిన్‌ సోదరుడు ఆదిత్య దర్శకత్వం వహించారు. త్రిగుణ్‌, శుభశ్ర్రీ ప్రధాన పాత్రలను పోషించారు. రక్షన్‌ హీరోగా నటించిన ‘మరక్కుమా నెంజం’ కూడా అదేరోజు విడుదల కానుంది. ఇందులో మలినా, రాహుల్‌ నటించారు. స్కూల్‌లైఫ్‌ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. సాత్విక్‌వర్మతో పాటు పలువురు కలిసిన నటించిన చిత్రం చిక్లెట్స్‌్‌. ముత్తు దర్శకత్వంలో సాత్విక్‌ వర్మ, జాక్‌ రాబిన్‌సన్‌,నయన్‌ కరిష్మా, అమృత హల్తార్‌ నటించిన చిత్రం ఇది. 2కె కిడ్స్‌ రొమాన్స్‌ కథగా ఇటీవల ట్రైలర్‌లో చూపించారు.

➡️