గుంటూరుకారంలో కృష్ణ డైలాగులు

Jan 2,2024 19:25 #mahesh babu, #movie

హీరోగా మహేష్‌బాబు, హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించిన చిత్రం గుంటూరుకారం. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. తండ్రి కృష్ణ సినిమాల్లోని డైలాగులను ఈ సినిమాలో మహేష్‌ ప్రస్తావించినట్లుగా సమాచారం. కృష్ణ చనిపోయిన తర్వాత వస్తున్న మొదటి చిత్రం ఇదే. అందుకే ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌లను ఇచ్చేలా దర్శకుడు త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేసినట్లుగా సమాచారం. ఒక పాపులర్‌ డైలాగ్‌ను మహేష్‌బాబు చేత ఫైటింగ్‌ సన్నివేశంలో చెప్పించారని తెలుస్తోంది. హిట్‌ బిట్‌ ‘సాంగ్‌’ కూడా ఉందని సమాచారం.

➡️