‘గేమ్‌ ఆన్‌’ ట్రైలర్‌ విడుదల

Jan 20,2024 19:31 #geethanand, #movie

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. సీనియర్‌ నటులు మధుబాల, ఆదిత్య మీనన్‌, శుభలేఖ సుధాకర్‌ కీలక పాత్రలు పోషించారు. కస్తూరి క్రియేషన్స్‌ అండ్‌ గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల కానుంది. శనివారం చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ‘మంచి కథతో ఈ సినిమాను స్టార్ట్‌ చేసాం. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా రూపొందించాం’ అని నిర్మాత అన్నారు. ‘ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి, రియల్‌ టైమ్‌ సైకలాజికల్‌ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? వంటి అనేక అంశాలతో ఈ సినిమా తెరకెక్కిన’ట్లు దర్శకుడు చెప్పారు.

➡️